ఆ ఎంపీ కోసం వాళ్లంతా ఢిల్లీ వెళ్లారు

by srinivas |
ఆ ఎంపీ కోసం వాళ్లంతా ఢిల్లీ వెళ్లారు
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ రెబెల్, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అనర్హత పిటిషన్ నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీలంతా లాయర్లతో కలిసి ప్రత్యేక విమానంలో డిల్లీ బయల్దేరి వెళ్లారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సారథ్యంలో వారంతా విమానంలో బయల్దేరి వెళ్లారు. సాయంత్రం మూడు గంటలకు వారంతా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న రఘురామకృష్ణం రాజుపై అనర్హత వేటు వేయాలని కోరనున్నారు. ఈ మేరకు ఉన్న న్యాయపరమైన చిక్కు ముళ్లు విప్పేందుకు న్యాయవాదులను కూడా తీసుకెళ్తున్నారు.

Advertisement

Next Story