- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పరువు తీస్తున్నారు.. చర్యలు తీసుకోండి : సీఐడీకి మహిళా ఎమ్మెల్యే ఫిర్యాదు

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు ఆమె పర్యటనలు, తీసుకున్న నిర్ణయాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. అంతేగాకుండా సోషల్ మీడియా ద్వారా సమస్యలు తెలుసుకుని, పరిష్కరిస్తుంటారు. ఈ క్రమంలో యూట్యూబ్ చానెల్స్, ఫేక్ ఫేస్బుక్ అకౌంట్స్, కొన్ని మీడియా సంస్థలపై ఆమె గురువారం ఫిర్యాదు చేశారు. తన పరువుకు భంగం కలిగించేలా అభ్యంతకరంగా పోస్టులు పెట్టారని.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
వివరాళ్లోకి వెళితే.. గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విడదల రజిని సీఐడీ అడిషనల్ డీజీ సునీల్‌కుమార్‌ను కలిశారు. కొన్ని యూట్యూబ్ చానెల్స్, ఫేక్ ఫేస్బుక్ అకౌంట్స్, కొన్ని మీడియా సంస్థలపై ఫిర్యాదు చేశారు. తన పరువుకు భంగం కలిగించేలా అభ్యంతకరంగా పోస్టులు, కథనాలు పెట్టారని.. కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలను సీఐడీకి ఎమ్మెల్యే అందజేశారు. విడదల రజిని ఫిర్యాదుపై డీజీ సునీల్ కుమార్ సీరియస్‌గా స్పందించారు. ఫేక్ అకౌంట్లను గుర్తించి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు.