- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వైసీపీ నాయకులను తొక్కిపడేశా : రోజా
దిశ, వెబ్‌డెస్క్ : వైసీపీలో ఉంటూ వెన్నుపోటు పొడిచిన నాయకులను తొక్కిపడేశానని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. అలాంటి నాయకులను మున్సిపల్ గేటును కూడా తాకనీయనని ఆమె హెచ్చరించారు. సొంతపార్టీ వారే వెన్నుపోటు పొడిచినా నగరి, పుత్తూరు మున్సిపాలిటీలను గెలిచామని రోజా ఆనందం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీల కంటే సొంత పార్టీ నుంచే ఇబ్బంది ఎదురైందని చెప్పారు. రెబల్స్‌తో నామినేషన్ వేయించిన వారికి ఇదే నా వార్నింగ్.. చైర్మన్ సీటు కాదు.. మున్సిపల్ ఆఫీస్ గేటు కూడా తాకలేరని రోజా హెచ్చరించారు.
ఇనామస్‌ల కంటే పోరాడి గెలవడంలోనే కిక్కు ఉంటుందని, నేను అలాగే గెలిచానని ఆమె పేర్కొన్నారు. ఇది నగరి వైసీపీ నాయకుల టీం వర్క్ తోనే సాధ్యమైందని, ఈ విజయాన్ని సీఎం జగన్ కు గిఫ్ట్ గా ఇస్తున్నామని రోజా తెలిపారు. బాలకృష్ణ రీల్ హీరో అయితే, జగన్ రియన్ హీరో అన్నారు. వైసీపీకి ఒకరు ఎదరొచ్చినా.. వైసీపీ ఒకరికి ఎదురెళ్లినా.. తొక్కిపడేస్తామని ఆమె వ్యాఖ్యానించారు. జగన్ విజయాన్ని చూసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోనే ఉండిపోయారని, ఇక వారి అవసరం ఏపీకి అవసరం లేదని రోజా ఎద్దేవా చేశారు.