- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి.. వైఎస్ షర్మిల డిమాండ్
దిశ, మహబూబాబాద్: తెలంగాణలో వందల మంది నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వైఎస్ షర్మిల అన్నారు. ఇవన్నీ కేసీఆర్ చేసిన హత్యలు అంటూ ఆరోపించారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గూండెంగ గ్రామంలో ఆమె నిరుద్యోగ నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. నిధులు, నియామకాలు, నీళ్ల కోసమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగిందని గుర్తు చేశారు. కానీ, కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు రాక యువకులు మానసిక క్షోభకు గురవుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం పాలన, పరిపాలన చేతకాని వాళ్ళ చేతిలో ఉందన్నారు.
రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. కేసీఆర్‌కు చలనం లేదని.. అలాంటప్పుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసి, ఉద్యోగాల భర్తీ చేసి ఉంటే ఒక్కరు కూడా చనిపోకపోవని అంచనా వేశారు. ఇదే గ్రామ శివారు రాంసింగ్ తండాలో సునీల్ నాయక్ అనే విద్యార్థి ఉద్యోగం రాలేదని మనస్థాపంతో 5 నెలల క్రితం ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా.. వీరి కుటుంబం వైపు కన్నెత్తి చూడకపోవడం బాధాకరం అన్నారు. ఆకలి చావులు, ఆత్మహత్యలు తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయని షర్మిల చెప్పుకొచ్చారు.