- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఏడాది పాలనలో 1.02కోట్ల మంది ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి’
దిశ, ఏపీ బ్యూరో: అట్టడుగు వర్గాల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, నిరుపేదలకు ఎంత మేలు జరిగితే అంత మంచిదని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తమ ఏడాది పాలనలో 1,01,82,319మంది ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి చేకూర్చామని వెల్లడించారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి 6వ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు ఆదిమూలపు సురేశ్, తానేటి వనిత, పినిపే విశ్వరూప్, ధర్మాన కృష్ణదాసు, ఏపీ సీఎస్‌లతోపాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, 2019-20లో ఎస్సీల కోసం రూ.11,205.41కోట్లు, ఎస్టీల కోసం మరో రూ.3,669.42కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.
అలాగే, ఈ ఏడాది (2020-21)కి సంబంధించి కొత్తగా అమలు చేయనున్న ఆసరా, చేయూత పథకాలతో కలిపి ఎస్సీల కోసం రూ.15,735కోట్లు, ఎస్టీల కోసం రూ.5,177 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. దీంతో ఇప్పటివరకు ఎస్సీల్లో 77,27,033 మందికి, ఎస్టీల్లో 24,55,286 మందికి లబ్ధి చేకూరిందని చెప్పారు. కొత్తగా అమలవుతున్న ఆసరా, చేయూత పథకాలతో ఎస్సీ, ఎస్టీలకు పెడుతున్న ఖర్చు మరింత పెరుగుతుందని చెప్పారు.
90లక్షల మంది మహిళలకు ‘వైఎస్సార్ చేయూత’:
వైఎస్సార్ ఆసరా కింద ఇప్పటివరకు 25లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరగా, వైఎస్సార్ చేయూత కింద దాదాపు 90లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరిందని జగన్ వెల్లడించారు. తద్వారా మహిళల ఆర్థిక స్తోమత, జీవన ప్రమాణాలు పెరుగుతాయని ఆకాంక్షించారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి అమూల్‌తో ఈనెల 21న అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నామని, తద్వారా పాడి పరిశ్రమ రంగంలో మహిళల్ని మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దవచ్చని అభిప్రాయపడ్డారు. విజయవాడలో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో 2021 ఏప్రిల్ 14నాటికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిన పార్కు నిర్మాణ లక్ష్యం నెరవేరాలని ఆయన పేర్కొన్నారు.
20ఎకరాల్లో నిర్మించనున్న పార్కు పనులను రెండు విభాగాలుగా విభజించి, విగ్రహ నిర్మాణం, ల్యాండ్ స్కేపింగ్ విడివిడిగా ఒకేసారి పనులు ప్రారంభించాలని వచ్చే ఏప్రిల్ 14నాటికి పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరానికే ఈ పార్కు తలమానికం కావాలని ఆయన సూచించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీలకు సీఎం మేలు చేశారని మంత్రులు ధన్యవాదాలు తెలిపారు.