- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
10 వేల లీటర్ల కోక్‌లో బేకింగ్ సోడా కలిపితే?
దిశ, వెబ్‌డెస్క్ :
కూల్‌డ్రింక్స్‌తో చాలా మంది చాలా రకాల ప్రయోగాలే చేశారు. అందులో మెంతాల్ క్యాప్సుల్స్‌తో చేసిన ప్రయోగాలు ఎక్కువగా పాపులర్ అయ్యాయి. కూల్ డ్రింక్ బాటిల్‌ను కాస్త కదిలించి క్యాప్ ఓపెన్ చేస్తే చాలు.. అందులోని డ్రింక్ అంతా బుస బుసమని పొంగుతుంది. మరి అలాంటి వాటిలో మెంతాల్ వేస్తే ఇంకెలా ఉంటుంది? ఒక్కసారిగా ఉప్పొంగిపోతుంది. ఇవన్నీ కామన్‌గా ఇంట్లో చేసుకునే సరదా సరదా ప్రయోగాలు. అయితే, రష్యా యూట్యూబర్, పాపులర్ వ్లాగర్ మాగ్జిమ్ మొనాకోవ్.. వీళ్లందరికంటే మరింత డిఫరెంట్‌గా ఆలోచించాడు. అందుకోసం 10 వేల లీటర్ల కోకాకోలాను, లక్షల రూపాయలను ఖర్చు చేశాడు.
ఫన్నీ ప్రయోగాలు చేయడమంటే అందరికీ భలే ఇష్టం. యూట్యూబ్‌లో కూడా అలాంటి వీడియోలను చూసేందుకు నెటిజన్లు తెగ ఇష్టపడుతుంటారు. ‘మాగ్జిమ్’ కూడా ఇలాంటి ప్రయోగాలే చేస్తుంటాడు. అయితే, ఈసారి రాజమౌళి సినిమా సెట్టింగ్‌ల మాదిరి భారీ ప్రయోగమే చేశాడు. ఇందుకోసం మాగ్జిమ్ టీమ్ ముందుగా ఓ మంచి ప్లేస్‌ను వెతికి పెట్టింది. ఆ తర్వాత ప్రయోగానికి కావాల్సిన పెద్ద కోక్ టిన్నును తయారు చేసింది. వెయ్యి లీటర్లు, రెండు వేల లీటర్లు కాదు.. ఏకంగా పదివేల లీటర్ల కోక్‌లో క్రేన్ సాయంతో తినే సోడా కలిపాడు. ఇంకేముంది హైడ్రోజన్‌తో కార్బొనేట్ జట్టు కడితే.. మామూలుగా ఉంటుందా! ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్దలై లావా ఉప్పొంగినట్లు, కోక్ బాటిల్ నుంచి కోకాకోలా ద్రవం అంతెత్తున పైకి లేచింది. ఊరికి దూరంగా ఓ నిర్మానుష్యమైన ప్రదేశంలో చేసిన ఈ ప్రయోగం మొత్తాన్ని.. అందంగా చిత్రీకరించింది మాగ్జిమ్ టీమ్. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తుండటం విశేషం. కాగా ఈ వీడియో కోసం మాగ్జిమ్.. దాదాపు రూ. 6.95 లక్షలు ఖర్చు చేయడం గమనార్హం.
బేకింగ్ పౌడర్‌లోని కార్బొనేట్, కోకాకోలాలోని హైడ్రోజన్‌తో కలిసి చర్యనొంది.. హైడ్రోజన్ కార్బొనేట్ తయారవుతుంది. అది వెంటనే నీరులా మారి, ఆ తర్వాత కార్బన్ డై ఆక్సైడ్‌గా మారుతుంది. వెంటనే ఆ గాలి బయటకొచ్చేందుకు ప్రయత్నించే క్రమంలో అధిక ప్రెజర్‌తో బయటకు ఎగజిమ్ముతుంది.