ఒకే ఒక్క ఛాన్స్ నేనేంటో చూపిస్తా

by Anukaran |   ( Updated:2021-03-09 05:14:30.0  )
ఒకే ఒక్క ఛాన్స్ నేనేంటో చూపిస్తా
X

దిశ,వెబ్‌డెస్క్: యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ తనకు ఒక్కే ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రాదేయపడుతున్నాడు.

ఇటీవల జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో మద్యం మత్తులో షణ్ముఖ్ రెండు కార్లు, రెండు బైక్‌ల‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో పోలీసులు షణ్ముఖ్‌ జశ్వంత్‌ను అదుపులోకి తీసుకొని బ్రీత్ పోలీసులు బ్రీత్ ఎనలైజర్ ‌లో చెక్ చేస్తే.. 170 వచ్చినట్టు తెలిపారు. అనంతరం ఐపీసీ సెక్షన్ 337, 279 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో షణ్ముక్‌కు స్టేషన్ బెయిల్ ఇచ్చిన పోలీసులు.. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌కు హాజరు కావాలంటూ నోటిసులు ఇచ్చారు. కానీ ఆ నోటీసులకు షణ్ముఖ్ స్పందించలేదు. షణ్ముఖ్‌ తీరుపై ఆగ్రహంతో ఉన్న జూబ్లీహిల్స్ పోలీసులు కోర్ట్ ప్రొసీడింగ్స్‌కు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో షణ్ముఖ్‌ యాక్సిడెంట్ పై ఓ వీడియోను విడుదల చేశారు. మీ సపోర్ట్ లేకపోతే నేను లేను. ఏం బ్యాంగ్రౌండ్ లేదు నాకు. మీరే అంతా. కొన్ని ఎమోషన్స్ మాటల్లో చెప్పలేను. సినిమా సినిమా అని కలలు కన్నాను చిన్నప్పుడు నుండి. ఒక అవకాశం ఇవ్వండి ప్లీజ్’ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లను కోరుతున్నాడు.

Advertisement

Next Story

Most Viewed