- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కంటెంట్ క్రియేటర్స్‌కు యూట్యూబ్ బంపర్ ఆఫర్
దిశ, ఫీచర్స్ : తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా సూపర్ సక్సెస్ సాధించింది ‘టిక్‌టాక్’. మనదేశంలోనూ ‘టిక్‌టాక్’కు ఎదురులేకుండా పోగా దానిపై నిషేధం విధించడంతో టిక్‌టాక్ స్పేస్‌ను, దాని క్రేజ్‌ను మిగతా యాప్స్ అందిపుచ్చుకోవాలనుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇబ్బడిముబ్బడిగా టిక్‌టాక్ తరహా యాప్‌లు పుట్టుకొచ్చాయి. ఇన్‌స్టా, యూట్యూబ్ వంటి పాపులర్ సోషల్ మీడియా యాప్స్ కూడా షార్ట్ వీడియోలకు అవకాశం కల్పించాయి. ఈ క్రమంలోనే యూజర్లను మరింత ఆకట్టుకునేందుకు యూట్యూబ్ ‘షార్ట్ వీడియో’ కంటెంట్ క్రియేటర్స్ కోసం 100 మిలియన్ డాలర్ల నిధిని ప్రారంభిస్తున్నట్లు యూట్యూబ్ తెలిపింది.
యూట్యూబ్‌లో షార్ట్ వీడియో కంటెంట్ క్రియేటర్స్ ఇప్పటికే యాడ్ రెవెన్యూ అందుకుంటున్నారు. అయితే దీనికి అదనంగా, యూట్యూబ్ మార్గదర్శకాలను అనుసరించే ఏ వీడియో మేకర్‌కైనా, వ్యూయర్‌షిప్, ఎంగేజ్‌మెంట్ ఆధారంగా డబ్బులు చెల్లిస్తామని యూట్యూబ్ తమ బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొంది. ఇప్పటికే యూట్యూబ్ తమ షార్ట్ వీడియోలను సక్సెస్ చేయడానికి టిక్‌టాక్ స్టార్స్‌ను కూడా రిక్రూట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ప్రకటించిన ఫండ్‌తో మరింతమంది కంటెంట్ క్రియేటర్స్‌ను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుండగా, ఈ ఫండ్‌తో పాటు యూట్యూబ్ షార్ట్స్ కోసం ఫుటేజ్ షూట్ చేయడాన్ని మరింత సులభతరం చేయడానికి కొత్త ఫీచర్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.
చాలా మంది యూట్యూబర్‌లు టిక్‌టాక్, ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌కు షిఫ్ట్ కావడంతో యూట్యూబ్ 2020లో స్టార్ క్రియేటర్స్‌తో ‘షార్ట్’ పరిచయం చేసింది. దాంతో పాటు వీడియో-మేకర్స్ ప్రకటనలకు మించి డబ్బు సంపాదించడానికి అనేక టూల్స్ అందించింది. మార్చి నాటికి, షార్ట్స్ ఫీచర్ రోజువారీ వీక్షణలను 6.5 బిలియన్లకు పైగా సంపాదించించడం విశేషం. ప్రస్తుతం వస్తున్న ఆదరణ అలాగే కొనసాగించడానికి యూట్యూబ్ ఈ ఫండ్ క్రియేట్ చేసినట్లు తెలిపింది.