సెల్ టవర్ వద్దు.. నాగర్‌కర్నూల్‌లో యువత ఆత్మహత్యాయత్నం

by Sumithra |
సెల్ టవర్ వద్దు.. నాగర్‌కర్నూల్‌లో యువత ఆత్మహత్యాయత్నం
X

దిశ, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టణంలోని 17వ వార్డులో ఇళ్ల మధ్యన సెల్ టవర్ నిర్మించవద్దని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. పోలీసుల బందోబస్తుతో నిర్మిస్తుండడంతో మనస్తాపం చెందిన రహీం అనే స్థానిక యువకుడు టర్పెంటాయిల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే అతడిని కాపాడి నీళ్లు పోస్తుండగా మరో ఇద్దరు యువకులు శేఖర్, శివ శంకర్‌లు నూతనంగా నిర్మిస్తున్న టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో కొద్దిసేపు గందరగోళం పరిస్థితి నెలకొంది. టవర్ నిర్మాణం చేపట్టవద్దని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు స్పందించకపోవడం దారుణమని స్థానికులు మండిపడుతున్నారు.

Advertisement

Next Story