- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘పరీక్షలు వెంటనే రద్దు చేయాలి’
దిశ, షాద్ నగర్ : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణలో అన్ని పరీక్షలను వెంటనే రద్దు చేసి, విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని ఎన్‌ఎస్‌యూఐ నేషనల్ కన్వీనర్ దినేష్ సాగర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని ముఖ్యకూడలిలో ప్రభుత్వ వైఖరిపై ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొవద్దనే ఉద్దేశంతో గత నెల రోజుల నుంచి డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, డిప్లొమా, పీజీ విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని కోరుతూ తెలంగాణ ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో సుమారు 20 రోజుల క్రితం విద్యాశాఖ మంత్రిని, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మెన్, జిల్లా కలెక్టర్లను కలిసి వినతిపత్రం సమర్పించినా, ప్రభుత్వం నేటికీ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర కోఆర్డినేటర్ కాట సుధీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ యాదవ్, కార్యదర్శి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.