భ‌ద్రాద్రి జిల్లాలో తొలి క‌రోనా మ‌ర‌ణం

దిశ, ఖ‌మ్మం: భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో తొలి క‌రోనా మ‌ర‌ణం చోటుచేసుకుంది. ఇల్లందు నియోజ‌క‌వ‌ర్గ కేంద్రానికి చెందిన బి.అనుషా(24) గురువారం హైద‌రాబాద్ గాంధీ ఆస్పత్రికి త‌ర‌లిస్తుండ‌గా మార్గంమ‌ధ్య‌లో చ‌నిపోయింది. వారం రోజుల క్రితం క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో అనూష‌ను ఇల్లందు క్వారంటైన్ కేంద్రానికి వైద్యులు త‌ర‌లించారు. ఆరోగ్యం క్షీణించ‌డంతో గురువారం గాంధీ ఆస్ప‌త్రికి త‌రలిస్తుండ‌గా మృతి చెందినట్టుగా వైద్య అధికారులు తెలిపారు.

Advertisement