ప్రేమ కోసం యువతి సాహసం.. పోలీసులు షాక్

by  |
ప్రేమ కోసం యువతి సాహసం.. పోలీసులు షాక్
X

ప్రేమ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని హనుమాన్ జంక్షన్‌కి చెందిన యువతి చేసిన సాహసాన్ని విన్న పోలీసులు షాక్ తిన్నారు. ఇంతకీ పోలీసులే షాక్ తినేంత సాహసం ఏం చేసిందంటే.. సుమారు లాక్‌డౌన్ సమయంలో సుమారు 70 కిలోమీటర్ల దూరం నడిచింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే… కృష్ణాజిల్లా, మచిలీపట్నంలోని ఈడేపల్లికి చెందిన కళ్లేపల్లి సాయి పున్నయ్య (22), హనుమంజంక్షన్‌కు చెందిన చిటికెల భవాని (18) నిన్న ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఈ విషయంలో భవాని కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో నూతన దంపతులను వారి కుటుంబ సభ్యులు బెదిరించారు. దీంతో వారిద్దరూ చిలకలపూడి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తమ కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కావాలంటూ ఫిర్యాదు చేశారు. కరోనా కారణంగా రాష్ట్రమంతా లాక్‌డౌన్ అమలవుతున్న ప్రస్తుత తరుణంలో హనుమాన్ జంక్షన్ నుంచి మచిలీపట్నం ఎలా రాగలిగావంటూ భవానీని సీఐ వెంకట రమణ ప్రశ్నించారు.

నడుచుకుంటూ మచిలీపట్నం వచ్చానని భవానీ చెప్పడంతో స్టేషన్‌లో ఉన్నవారంతా షాక్ తిన్నారు. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం సుమారు 70 కిలోమీటర్లు ఉంటుంది. ప్రియుడ్ని దక్కించుకునేందుకు ఇంత దూరం నడిచానని భవానీ చెప్పింది. దీంతో తామిద్దరం పెళ్లి చేసుకున్నామని, అది నచ్చని కుటుంబ సభ్యులు ఫోన్ చేసి తమను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

Tags: love marriage, family worning, police, krishna district, hanuman junction, machilipatnam,



Next Story

Most Viewed