- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రేమించిన అమ్మాయి మాట్లాడట్లేదని గొంతు కోసుకున్న యువకుడు

X
దిశ, కామారెడ్డి: ప్రేమించిన అమ్మాయి మాట్లాడటంలేదని యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి పట్టణానికి చెందిన నడిపి నరేష్, హైదరాబాద్ కు చెందిన యువతిని ప్రేమించాడు. ఇద్దరి మధ్య అనుబంధం పెరగడంతో ఫోన్ సంభాషణ పెరిగింది. అయితే కొద్దిరోజులుగా ఆ అమ్మాయి నరేష్ తో మాట్లాడటం మానేసింది. దీంతో గురువారం రాత్రి నరేష్ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే నరేష్ ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story