- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టి… యువకుడు మృతి

X
దిశ, వెబ్‌డెస్క్: బైకును వేగంగా నడుపుకుంటూ వెళ్లి, ఓ యువకుడు ట్రాక్టర్ ట్రాలీని ఢీ కొన్నాడు. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కొత్తగూడెం రుద్రంపూర్ ఫిల్టర్బెడ్ వద్ద చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… చుంచుపల్లి మండలం పెనగడప గ్రామానికి చెందిన నిడల వేణు (22) పెనగడప నుంచి రుద్రంపూర్‌కు బైక్‌పై బయల్దేరాడు.
రుద్రంపూర్ ఫిల్టర్బెడ్ వద్దకు వెళ్లగానే బైక్ అదుపుతప్పి ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
Next Story