పెళ్లికి నిరాకరించిందని యువకుడు ఆత్మహత్య..!

దిశ, కొత్తగూడెం: ప్రియురాలు పెళ్లికి నిరాకరించిందని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలోని మధురబస్తీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. టేకులపల్లి మండలం బోడు గ్రామానికి చెందిన కె.రామ్ ప్రసాద్ కొత్తగూడెం సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకునేందుకు రామ్ ప్రసాద్ ప్రియురాలిని రమ్మని కోరడంతో.. సదరు యువతి నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురైన రామ్ ప్రసాద్.. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also…

శ్రావణి సూసైడ్ కేసులో కొత్త కోణం

Advertisement