- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆటో ఢీకొని యువకుడు మృతి
దిశ, కుత్బుల్లాపూర్: ఆటో ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. ఎస్సై మహేశ్ వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడకు చెందిన ఎస్.సత్తయ్య కుమారుడు కుమార్(36) గురువారం రాత్రి తన స్నేహితులైన రమేశ్, కృష్ణలతో కలిసి మేడ్చల్‌కు ద్విచక్రవాహనంపై వెళ్లారు. అనంతరం రాత్రి 11 గంటల సమయంలో తిరిగి వస్తున్నారు. కొంపల్లి చౌరస్తాకు రాగానే వాహనాన్ని గుండ్లపోచంపల్లి వైపు యూటర్న్ తీసుకుంటుండగా దూలపల్లి నుంచి బొల్లారం వైపు వేగంగా వచ్చి యూటర్న్ తీసుకుంటున్న ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెనకాల కూర్చున్న రమేశ్, కృష్ణలకు స్వల్ప గాయాలు కాగా, బైక్ నడుపుతున్న కుమార్ తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలతో బతికిబయటపడే వారని స్థానికులు చర్చించుకున్నారు. కుటుంబ సభ్యలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.