సిద్ధిపేటలో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

దిశ, సిద్ధిపేట: ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామంలో గడ్డం రాజు అనే యువకుడు తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement