పోలీస్‌స్టేషన్ ముందు నిప్పంటించుకున్న యువకుడు

by  |

దిశ, క్రైమ్‌బ్యూరో: పోలీస్‌స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన పాతబస్తీలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో పాత నేరస్థుడు షబ్బీర్ (25) గతంలో నాలుగు కేసుల్లో నిందితుడు. ఇప్పటికే ఈ కేసులపై అనుభవించాడు. అయితే, ఓ సెల్‌ఫోన్ దొంగతనం కేసులో సీఐ రుద్ర భాస్కర్ పాత నేరస్థుడు షబ్బీర్‌ను విచారణ నిమిత్తం పిలిపిస్తూ వేధింపులకు గురి చేస్తున్నట్టు ఆరోపణలు వస్తుండగా.. జైలు శిక్ష అనుభవించిన తర్వాత షబ్బీర్ ను కుటుంబ సభ్యులు పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే మద్యానికి బానిసైన షబ్బీర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. షబ్బీర్‌ను వెంటనే పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం షబ్బీర్ ఆరోగ్యం నిలకడగా ఉంది.



Next Story

Most Viewed