నోటిఫికేషన్లు రావడంలేదని నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం

by Sridhar Babu |
నోటిఫికేషన్లు రావడంలేదని నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం
X

దిశ, నల్లగొండ: ఉద్యోగ నోటిఫికేషన్లు రావడంలేదని ఓ నిరుద్యోగి పురుగుల మందుతాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం, మేడారం గ్రామానికి చెందిన నీలకంఠం సాయి డిగ్రీ పూర్తిచేసుకుని ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లాకేంద్రంలో స్నేహితులతో కలిసి అద్దెగది తీసుకుని కాంపిటేటీవ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్లు జారీ చేయకపోవడంతో తీవ్రమైన మనస్తాపానికి గురై శుక్రవారం ఉదయం పురుగులమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గమనించిన స్నేహితులు వెంటనే నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాడు. ప్రస్తుతం నిరుద్యోగి సాయి పరిస్థితి నిలకడగానే ఉందని స్నేహితులు తెలిపారు.

Next Story

Most Viewed