- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేషన్ పేరుతో మైనర్‌ను రేప్ చేసిన కామాంధుడు..!
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ఓ గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచార ఘటన సంచలనం రేపింది. 20 రోజుల క్రితం జరిగిన ఘటన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగు చూసింది. గత నెల చివరలో ఓ బాలిక(11) ఇంటిలో ఒంటరిగా ఉన్నప్పుడు.. అదే గ్రామానికి చెందిన యువకుడు రేషన్ సరుకులు ఇప్పిస్తానని తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఇటీవల బాలిక కడుపు నొప్పి అని చెప్పడంతో వైద్యుల వద్దకు తీసుకుపోగా పరిక్షీంచిన వైద్యులు అనుమానంతో బాలికను ఆరా తీయగా.. యువకుడు చేసిన పాడు పని గురించి చెప్పింది.
దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఈ నెల 13న బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే గ్రామస్తులు, కుల పెద్దల నుంచి కేస్ వాపస్ తీసుకోవాలని, సెటిల్మెంట్ చేసుకోవాలని ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం. ఏదేమైనా బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఈ మేరకు కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు బోధన్ రూరల్ సీఐ రవీందర్ నాయక్ తెలిపారు. బాలికపై అత్యాచారం చేసిన శ్రీకాంత్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.