- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగశౌర్య ‘లక్ష్య’ ‘వరుడు కావలెను’ టీజర్లు రిలీజ్
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తూ లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయటపడుతున్నాడు. యాక్షన్ సినిమాలతో మాస్ ఆడియన్స్‌కి దగ్గరవుతూనే.. ఫ్యామిలీ సినిమాలతో క్లాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటున్నాడు. ఈ రోజు (శుక్రవారం) హీరో నాగశౌర్య బర్త్ డే. ఈ సందర్భంగా తాను నటించే సినిమాల నుంచి బ్యాక్ టూ బ్యాక్ అప్‌డేట్స్ ఇస్తూ శౌర్యకి బర్త్ డే విషెస్ చెబుతున్నారు మూవీ మేకర్స్. గతేడాది ‘అశ్వత్థామ’ చిత్రంతో ప్రేక్షకులను పలుకరించిన నాగశౌర్య.. ప్రస్తుతం ‘లక్ష్య’ ‘వరుడు కావలెను’ ‘పోలీసు వారి హెచ్చరిక’ చిత్రాల్లో నటిస్తున్నాడు.
‘వరుడు కావలెను’ టీమ్ శౌర్యకి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో నాగశౌర్య స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు. విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించగా, లక్ష్మీ సౌజన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తోంది. ‘పెళ్లి చూపులు’ ఫేమ్ రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని 2021 మే నెలలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
‘లక్ష్య’ చిత్రంలో నాగశౌర్య సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీలో..ఆర్చరీలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తిగా నాగశౌర్య కనిపించనున్నాడు. కేతిక శర్మ హీరోయిన్. శరత్‌మరార్, నారాయణ్ దాస్ నారంగ్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2021 మొదటి త్రైమాసికంలో ఈ మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదం’ అంటూ జగపతి బాబు టీజర్‌లో చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. సిక్స్ ప్యాక్‌లో సూపర్ ఇంటెన్స్ లుక్‌తో నాగశౌర్య కనిపించారు. ‘చాలా మందికి ఆటతో గుర్తింపు వస్తుంది. కానీ, ఎవడో ఒకడు పుడతాడు.. ఆటకే గుర్తింపు తెచ్చేవాడు’అని జగ్గుభాయి చెప్పే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. టీజర్ ఆసాంతం ఆకట్టుకునే విధంగా ఉంది. నాగశౌర్యను విభిన్న గెటప్స్‌లో చూపించారు. బో అండ్ ఆరో పట్టుకునే ‘పార్థు’గా నాగశౌర్య..టీజర్ ఎండింగ్‌లో జగ్గుభాయ్..పవర్ ఫుల్ ఎక్స్‌ప్రెషన్స్ సూపర్బ్‌గా ఉన్నాయి.