- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నీ ఓటమి చూసేందుకైనా నువ్వు బ్రతికుండాలి ఈటల..

దిశ, హుజురాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇండిపెండెంట్‌గా ఉంటేనే నిజాయితీ ఉండేదని జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ అన్నారు. మంగళవారం హుజురాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజల సమస్యల కోసం ఏరోజూ పాదయాత్ర చెయ్యని ఈటల రాజేందర్.. ఇప్పుడు తనను గెలిపించాలని పాదయాత్ర చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.
తాను చేసిన తప్పుడు పనుల వల్లనే సీఎం కేసీఆర్ ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారని ఆమె పేర్కొన్నారు. తన ఆస్తులను కాపాడుకోవడానికి బీజేపీలో చేరారు. నల్ల చట్టాలు తెచ్చిన పార్టీలో ఎలా చేరారు అని ఆమె ప్రశ్నించారు. నీచ సంస్కృతి ఉన్న ఈటల రాజేందర్ తన ఓటమిని చూసేందుకు అయినా బ్రతికి ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.
మీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, రఘునందన్ రావులు గతంలో డ్రామాలు చేసి గెలిచారని.. ఇప్పుడు మీరు కూడా గెలుపు కోసం డ్రామాలు చేయడం నీచమైన చర్య అని అన్నారు. ఈటల రాజేందర్ నయిమ్‌ను మించిన వారు.. మిమ్మల్ని చంపే అవసరం ఎవరికీ లేదని, ఓటమి భయంతోనే ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. సీఎం సీటు కోసం అత్యాశకు పోయి పార్టీకి దూరమైంది ఈటలనే అని ఆమె అన్నారు.