ట్విట్టర్లో నయా ఫీచర్ ‘షెడ్యూల్ ట్వీట్ ’

by Shyam |   ( Updated:2020-05-29 06:43:40.0  )
ట్విట్టర్లో నయా ఫీచర్ ‘షెడ్యూల్ ట్వీట్ ’
X

దిశ, వెబ్ డెస్క్ :
పొట్టి పొట్టి మెసేజ్ లతో నెటిజన్లను ఆకట్టుకునే ట్విట్టర్.. మరో అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. ట్విట్టర్ యూజర్లు తమ ట్వీట్లను డ్రాఫ్ట్స్ లా సేవ్ చేసుకోవచ్చని, ఏ టైమ్ లో కావాల్సి వస్తే.. ఆ టైమ్ ప్రకారం వాటిని షెడ్యూల్ చేసుకోని ట్వీట్ చేయొచ్చని గురువారం ట్విట్టర్ కంపెనీ తెలిపింది.

ఈ షెడ్యూల్​ ఫీచర్.. ‘ట్విట్టర్ ఫర్ డెస్క్’ పేరుతో మొన్నటి వరకు డెస్క్​టాప్​ వాడేవాళ్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ యూజర్లకు ఈ ఫీచర్​ను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు ట్విట్ట‌ర్ వెల్ల‌డించింది. దీని ద్వారా ముందుగానే ట్వీట్​ చేసుకొని.. అనుకున్న స‌మ‌యానికి సెండ్​చేసుకునే సౌకర్యం ఉంటుంది. స్నేహితులు, కొలిగ్స్, బంధువులు ఇలా ఎవరి పుట్టిన రోజు శుభాకాంక్షలు అయినా.. షార్ప్ గా 12 గంటలకు పంపాలనుకునే వాళ్లకు.. ట్విట్టర్ తెచ్చిన ఈ షెడ్యూల్డ్ ట్వీట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకోసం మనం 12 వరకు వేచి ఉండనక్కర్లేదు. ట్విట్టర్ లో షెడ్యూల్డ్ చేసుకుని 10 గంటలకు పడుకున్నా.. 12 గంటలకు మన మెసేజ్ పర్టిక్యులర్ పర్సన్ కు చేరిపోతుంది. ట్వీట్​ చేసే ముందు.. మరోసారి చెక్ చేసుకునే వీలు కూడా కల్పించింది. సోషల్​ మీడియా మెనేజర్లు, మీడియా ప్రతినిధులకు ఈ ఫీచ‌ర్ ఎంతగానో యూజ్ అవుతోంద‌ని ట్విట్టర్​ భావిస్తోంది.

ఎలా చేయాలి

– ట్వీట్ కంపోజ్ చేస్తున్నప్పుడు, ఐకాన్స్ లో కేలండర్ కనపిస్తుంది.
– కేలండర్ పై క్లిక్ చేసి.. టైమ్ అండ్ డేట్ డిసైడ్ చేసుకోవాలి.
-డిటైల్స్ ఎంటర్ చేశాక.. కన్ ఫర్మ్ చేయాలి.
అంతే… ఫిక్స్ చేసిన తేదిలో, పర్టిక్యులర్ టైమ్ కు ఆ మెసేజ్ వాళ్లకు చేరిపోతుంది.ట్వీట్ ను సేవ్ చేయాలనుకుంటే.. క్లోజ్ విండో ఐకాన్ పై క్లిక్ చేయగానే.. సేవ్ చేయాలా వద్దా అనే ఆప్షన్ వస్తుంది. సేవ్ బటన్ క్లిక్ చేయగానే.. డ్రాఫ్ట్ సెక్షన్ లో మన ట్వీట్ సేవ్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed