- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చాహల్‌పై గేల్ ఆగ్రహం.. బ్లాక్ చేస్తానని బెదిరింపు
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా ఆటగాడు యజువేంద్ర చాహల్ అందరితో ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడో తెలిసిన విషయమే. ఇండియా ఆడే మ్యాచ్‌ల అనంతరం ‘చాహల్ టీవీ’ పేరుతో సరదా ఇంటర్వ్యూలు చేస్తుంటాడు. బీసీసీఐ కూడా అతని ఇంటర్వ్యూలను ప్రోత్సహిస్తుంటుంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా క్రీడాకారులందరూ ఇండ్లకే పరిమితమయ్యారు. కానీ, సోషల్ మీడియాలో కనిపిస్తూ అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. అంతే కాకుండా ఈ క్లిష్ట సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. అయితే యజువేంద్ర చాహల్ మాత్రం టిక్‌టాక్‌లో ఫుల్ బిజీ అయిపోయాడు. తన ఫ్యామిలీతో కలిసి పలు వీడియోలు చేస్తూ టిక్ టాక్‌లో పెడుతున్నాడు. అతడికి ఫాలోవర్స్ కూడా బాగానే ఉన్నారు. కాగా, చాహల్ టిక్‌టాక్ వీడియోలపై విండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌కు చిర్రెత్తుకొచ్చింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చాట్ చేసిన క్రిస్ గేల్.. ఇదే విషయంపై చాహల్‌పై విరుచుకుపడ్డాడు.
‘సోషల్ మీడియాలో నువ్వు చాలా డిస్ట్రబ్ చేస్తున్నావు. నిన్ను బ్లాక్ చేయాలని టిక్ టాక్ వాళ్లకు చెబుతాను. సోషల్ మీడియా నుంచి నువ్వు బయటకు రావాల్సిన అవసరం ఉంది. నీతో చాలా విసిగిపోయాం. నా జీవితంలో నిన్ను చూడదల్చుకోలేదు. నిన్ను బ్లాక్ చేస్తున్నా’ అని గేల్ చెప్పాడు. గేల్ ఒక్కడే కాదు కొన్ని రోజుల క్రితం కోహ్లీ, డివిలియర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేసుకున్న సందర్భంలోనూ డివిలియర్‌తో కోహ్లీ ఏం చెప్పాడంటే.. ‘నువ్వు చాహల్ టిక్ టాక్ వీడియోలు ఎప్పుడైనా చూశావా.. అతనికి 29 ఏండ్లు, అంతర్జాతీయ క్రికెట్ ఆడే ఆటగాడెవరైనా అలా చేస్తారనంటే నువ్వస్సలు నమ్మవు. పెద్ద జోకర్‌లా ఉంటాడు’ అని ట్రోల్ చేశాడు. మరి వీరి వ్యాఖ్యలకు చాహల్ ఎలా రియాక్ట్ అవుతాడో వేచి చూడాలి.
Tags : Cricket, Chris Gayle, AB De Villiers, Virat Kohli, Yuzvendra Chahal, TikTok, Instagram