- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒవైసీకి కౌంటర్ ఇచ్చిన సీఎం యోగి..
దిశ, వెబ్ డెస్క్ : యూపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. యూపీలో జరిగిన ఎన్ కౌంటర్లను తప్పుపడుతూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన విమర్శలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు. అపరాధులను క్షమించే ప్రసక్తే లేదు.. తప్పు చేసినవాడు కచ్చితంగా అపరాధే అవుతాడు. అపరాధికి ఏ మతమూ ఉండదని చెప్పారు. యూపీలో గత నాలుగేళ్లలో అనేక మార్పులు తీసుకొచ్చామని యోగి తెలిపారు.
2017లో తాము అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కొందరికి ఓటు హక్కు కూడా లేదని, రోడ్లు లేవని, పాఠశాలల్లో మౌలికవసతులు లేవని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక పరిస్థితిని మార్చామని తెలిపారు. గతంలో ఆరోగ్యశాఖలో ఎలాంటి సదుపాయాలు లేవని.. ఇప్పుడు పరిస్థితి మెరుగైందని అన్నారు. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని తెలిపారు. టూరిజం రంగంలో కూడా రాష్ట్రం పురోగమిస్తోందని.. ప్రయాగ్ రాజ్ కుంభమేళాతో మొదలు రామమందిర నిర్మాణం వరకు ముందుకు సాగుతున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధిని సాధిస్తామని చెప్పారు.