పెరిగిన యెస్ బ్యాంకు నికర నష్టాలు

by Harish |
పెరిగిన యెస్ బ్యాంకు నికర నష్టాలు
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చితో ముగిసిన త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర నష్టాలు రూ. 3,787.75 కోట్లుగా నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ రూ. 3,668.3 కోట్ల నష్టాలను వెల్లడించింది. సమీక్షించిన త్రైమాసికంలో బ్యాంకు ఆదాయం రూ. 4,805.30 కోట్లకు తగ్గిందని తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు ఆదాయం రూ. 5,818.19 కోట్లుగా ఉంది. అలాగే, డిపాజిట్లు వార్షిక ప్రాతిపదికన 54.7 శాతం పెరిగి రూ. 1.62 లక్షల కోట్లకు చేరుకున్నాయి. నికర వడ్డీ ఆదాయం 23 శాతం క్షీణించి రూ. 987 కోట్లుగా నమోదైనట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ త్రైమాసికంలో బ్యాంకు కేటాయింపులు రూ. 4,872 కోట్ల నుంచి 7.5 శాతం పెరిగి రూ. 5,240 కోట్లకు చేరుకున్నాయి. ఇక, మార్చి 31 నాటికి బ్యాంకు స్థూల నిరర్ధక అస్తులు(ఎన్‌పీఏ) 15.4 శాతంగా ఉన్నాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలొ శుక్రవారం బ్యాంక్ షేర్ ధర 0.7 శాతం పెరిగి రూ. 14.69 వద్ద ట్రేడయింది.

Advertisement

Next Story