- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ ఆశ్రమంపై.. సమగ్ర దర్యాప్తు చేపట్టాలి

X
దిశ, ఆందోల్: అనాథ ఆశ్రమం పేరిట అకృత్యాలకు పాల్పడుతూ బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు టి.నరేష్ డిమాండ్ చేశారు. అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని అనాథ ఆశ్రమంలో 14ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరారు.
ఆశ్రమ నిర్వహణపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించకూడదన్నారు. అదేవిధంగా నిర్భయ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఆశ్రమంలో జరిగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు.
Next Story