గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ-టీడీపీ కార్యకర్తలు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. నాదేండ్ల మండలం చిరుమామిళ్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈఘనటపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement