- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'టీడీపీ అనడం కన్నా " తెలుగు బూతుల పార్టీ" అంటే బాగుంటది'
దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో వైసీపీ ఎంపీలు మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. కోర్టు ధిక్కరణ చట్టం 1971 తరహాలో రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నవారిని దూషిస్తే కఠినంగా శిక్షించేలా చట్టం చేయాలని కేంద్ర న్యాయ శాఖకు సూచించాలని రాష్ట్రపతిని కోరినట్లు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తమ అభ్యర్థనలపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారన్నారు.
టీడీపీ నేతలు వాడుతున్న భాష, ప్రజా వ్యతిరేక విధానాలను, అధికార పదవుల్లో ఉన్న వారిపై వాడుతున్న రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతున్న వివరాలను రాష్ట్రపతికి వివరించామన్నారు. చంద్రబాబు తప్పులను వివరించడానికే రాష్ట్రపతిని కలిసినట్లు తెలిపారు. చంద్రబాబు స్వప్రయోజనాల కోసం ఢిల్లీ వచ్చి రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారిని కలిశారని చెప్పుకొచ్చారు. టీడీపీ కల్చర్ బూతుల కల్చర్ అని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు మాట్లాడేది బూతు భాష అని విమర్శించారు. టీడీపీ అనడం కన్నా తెలుగు బూతుల పార్టీ అంటే సమంజసంగా ఉంటుందని ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. బోసిడికే అన్న పదాన్ని రాష్ట్రపతికి ఎలా చెప్పాలన్న దానిపై చాలా సంకోచించామని తెలిపారు. పట్టాభి బోసిడికే వ్యాఖ్యలను చంద్రబాబు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లలేదని..తాము తీసుకెళ్తే ఇలాంటి భాష వాడతారా అని రాష్ట్రపతి ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.