‘ఆ కబుర్లతోనే నవ్వుల పాలయ్యాడు’

by srinivas |   ( Updated:2020-11-08 05:27:06.0  )
‘ఆ కబుర్లతోనే నవ్వుల పాలయ్యాడు’
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఎద్దేవకర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ట్విట్టర్‌లో ఓ పోస్ట్ అప్‌లోడ్‌ చేసిన విజయసాయిరెడ్డి చంద్రబాబును ఉద్దేశిస్తూ వ్యంగస్త్రాలు సంధించారు. ‘ఆయన ‘సలహాల’తోనే జో బైడెన్ గెలిచాడు అంటే, ఆట పట్టిస్తున్నారని ఆక్షేపిస్తారు గాని బాబు చెప్పే ‘కథలు’ అలాగే ఉంటాయి. ఎవరు విజయం సాధించినా, దేని గురించైనా నలుగురు ప్రశంసా పూర్వకంగా మాట్లాడుకున్నా అది నావల్లనే జరిగింది అంటాడు. పోసుకోలు కబుర్లవల్ల నవ్వులపాలు అవుతున్నా గ్రహించడు. అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Advertisement

Next Story