పచ్చరంగు బయటపడింది: విజయసాయిరెడ్డి

by srinivas |   ( Updated:2020-08-26 09:32:10.0  )
పచ్చరంగు బయటపడింది: విజయసాయిరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబు విసిరిన సవాల్‌ను ఏపీ ప్రభుత్వం స్వీకరించలేదని.. రాజధాని తరలింపుపై ప్రజాభిప్రాయం కొరకు https://apwithamaravati.com ద్వారా సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ వెబ్‌సైట్‌ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు.

ఈ నేపథ్యంలోనే ఆయన ట్వీట్ చేస్తూ.. ‘అమరావతిపై బాబుగారు పెట్టిన వెబ్ పోలింగ్ తో మరోసారి పచ్చరంగు బయటపడింది. అది ‘ఎల్లో’ బ్యాచ్ పోలింగ్ అని భలే కలర్ ఫుల్ గా చెప్పారు. అయ్యో.. మళ్ళీ దొరికిపోయారా జూమ్ బాబు ? అన్నట్టు.. ఆ వెబ్ సైట్ ని క్రాష్ చేశారెందుకు? అసలు రంగు బయటపడిందనా?’ అంటూ చురకలు వేశారు.

Advertisement

Next Story