- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘చంద్రబాబు విరాళంతో.. ఇంటికో కోడి గుడ్డు కూడా రాదు’
దిశ, ఏపీ బ్యూరో: తన మానాన తాను ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్న మత్తు డాక్టర్‌ను పచ్చ పార్టీ వాళ్లు రోడ్డున పడేశారని వైసీపీ ఎంపీ విజయసాయి విమర్శించారు. ట్విట్టర్ మాధ్యమంగా స్పందించిన ఆయన, సుధాకర్‌ను పచ్చపార్టీ సస్పెండ్ అయ్యేదాక రెచ్చగొట్టిందని ఆరోపించారు. మత్తు డాక్టర్ పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటే పోలీసులు మెంటల్ హాస్పిటల్‌కు తరలించారని అన్నారు. యాక్యూట్ అండ్ ట్రాన్సియెంట్ సైకోసిస్ వచ్చిందని సైకియాట్రిస్టులు తేల్చారని విజయసాయిరెడ్డి వెల్లడించారు.
కరోనాతో ప్రజలు టెన్షన్ పడుతుంటే నీరో చక్రవర్తిలా చంద్రబాబు ఫిడేల్ వాయించుకుంటున్నారని ఆయన విమర్శించారు. తోటివారి దురదృష్టాన్ని చాటుగా గమనిస్తూ ఆనందించేవారిని సైకాలజీలో శాదన్ ఫ్రాయిడా అనే రుగ్మతకు గురైన వారిగా భావిస్తారని, చంద్రబాబుది కూడా అదే కేసని ఆయన ఎద్దేవా చేశారు. కరోనాపై పోరుకు చంద్రబాబు ఇచ్చిన రూ. 10 లక్షల విరాళాన్ని ఐదు కోట్ల మందికి పంచితే, తలా రెండు పైసలు వస్తాయని నెటిజెన్లు లెక్కగట్టారని, కుటుంబానికి ఒక కోడిగుడ్డు కూడా రాదు కదా చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు.