- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చంద్రబాబు చంద్రముఖిల మారి నిమ్మగడ్డలో ప్రవేశించాడు
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ ప్రతిపక్షనేత చంద్రబాబుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వంపై, ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులపై, అడ్వైజర్లపై చర్యలు తీసుకుంటారు. కానీ పంచాయతీ ఎన్నికలు పార్టీల పరంగా జరగవని తెలిసీ మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. చంద్రబాబు – నిమ్మగడ్డ తీరు ఎలా ఉందంటే..,నిమ్మగడ్డది ఒట్టిశరీరమే..చంద్రబాబు..చంద్రముఖిలా మారి నిమ్మగడ్డను ఆవహించారని ఎద్దేవా చేశారు. నిమ్మగడ్డ మతిభ్రమించి ప్రతీనిమిషానికి బెదిరిస్తున్నారని వైసీపీ ఎంపీ మండిపడ్డారు.మతిస్థిమితం లేని వ్యక్తి రాజ్యంగ పదవిలో ఉండకూడదన్నారు. నిమ్మగడ్డను మెడికల్ బోర్డ్ కు రిఫర్ చేయాలన్నారు. చాగంటి, ఉషస్త్రీ, గరికపాటిని మించి నిమ్మగడ్డ ధర్మ ప్రవచనాలున్నాయని ఎద్దేవా చేశారు.నిమ్మగడ్డ..,కందగడ్డో,ఉల్లిగడ్డో,చామగడ్డో అర్ధం కావడంలేదు. ఎన్నికల సంఘం కమిషనరో..లేదంటే టీడీపీ కమిషనరో అదీ అర్ధం కావడం లేదని వైసీపీ ఎంపీ విజయ్ సాయిరెడ్డి విమర్శలు చేశారు.