చంద్రబాబు మాయలో పడొద్దు: వైసీపీ ఎంపీ

by srinivas |
చంద్రబాబు మాయలో పడొద్దు: వైసీపీ ఎంపీ
X

దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబు నాయుడు తన స్వార్థప్రయోజనాల కోసం అమరావతి రైతులను బలిపశువులను చేస్తున్నారని వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ అన్నారు. రైతులెవ్వరూ చంద్రబాబు మాయలో పడొద్దని సూచించారు. శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సురేశ్.. రైతులకు బేడీలు వేయడం తప్పు అని చెప్పారు. కానీ, ఇటువంటి చర్యలకు పాల్పడ్డ పోలీసుల పై ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. దళితుల జీవితాలతో టీడీపీ నేతలు రాజకీయాలు చేస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. వారంత జగన్ వెంటే ఉన్నారని విషయాన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు, టీడీపీ నేతలు దళితులను రెచ్చగొడుతున్నారని సురేశ్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed