అమిత్‌షాతో వైసీపీ ఎంపీ భేటీ… టీడీపీపై ఫిర్యాదు

by srinivas |   ( Updated:2021-10-28 05:13:49.0  )
అమిత్‌షాతో వైసీపీ ఎంపీ భేటీ… టీడీపీపై ఫిర్యాదు
X

దిశ, ఏపీ బ్యూరో: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ కావాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తుందన్నారు. జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు కుట్ర పన్నారని ఫిర్యాదు చేశారు. అసభ్యంగా మాట్లాడిన వారిని శిక్షించేలా చట్టాలను కఠినతరం చేయాలని అమిత్‌ షాకు ఎంపీ గోరంట్ల మాధవ్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story