నా బ్లూ ఫిల్మ్ సీడీలు అంటూ చూపించారు.. చంద్రబాబుపై రోజా సంచలన వ్యాఖ్యలు

by Anukaran |   ( Updated:2023-04-01 18:06:43.0  )
నా బ్లూ ఫిల్మ్ సీడీలు అంటూ చూపించారు.. చంద్రబాబుపై రోజా సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: విధి ఎవరినీ విడిచిపెట్టదు.. అందరి సరదా తీర్చేస్తది అంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా చంద్రబాబును ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దొంగ ఏడుపులు ఏడిస్తే ఎవరూ నమ్మరన్నారు. చంద్రబాబు మీడియా సమావేశంలో కన్నీరు పెట్టుకున్న విషయంపై స్పందించిన ఆమె.. తగిన శాస్త్రి జరిగిందన్నారు. గతంలో ఎన్టీఆర్ ను ఎలా ఏడిపించావో.. నీకు అదే పరిస్థితి వచ్చిందని రోజా ఆనందం వ్యక్తం చేశారు.

గతంలో హైదరాబాద్ సాక్షిగా ‘రోజా బ్లూ ఫిల్మ్‌లో నటించింది’ అంటూ పీతల సుజాతతో సీడీలు చూపించిన విషయాన్ని మర్చిపోయావా అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు నీకు గుర్తుకు రాలేదా ఫ్యామిలీ, విలువలు అంటూ నిలదీశారు. నీ భార్యను ఏదో అన్నారని గొంతు చించుకుంటున్నావు.. కానీ, నా పరువు తీసినప్పుడు ఫ్యామిలీ, పిల్లలు గుర్తుకు రాలేదా అంటూ నిలదీశారు. అధికారంలో ఉంటే ఏది చేసినా నడుస్తుందనే అహంకారంతో గతంలో చంద్రబాబు దారుణంగా వ్యవహరించారన్నారు.

విజయమ్మ, భారతమ్మ, షర్మిలపై కూడా అసత్య ప్రచారం చేశారని రోజా ఫైర్ అయ్యారు. చివరకు ప్రధాని మోడీని కూడా చంద్రబాబు వదల్లేదన్నారు. సోషల్ మీడియా పేరుతో ఎన్నో అసత్య ప్రచారాలను వ్యాప్తి చేశారని ఆరోపించారు. అందరి ఉసురు తగిలే చంద్రబాబుకు ఈ గతి పట్టింది అంటూ.. బైబై బాబు.. బైబై అంటూ రోజా ఎద్దేవా చేయడం గమనార్హం.

నాకు రాజకీయ భిక్ష పెట్టింది వారే: స్పీకర్ తమ్మినేని

విడాకుల తర్వాత చై నిర్ణయం ఏంటి.. వాటిని సామ్‌కి ఇచ్చేస్తాడా.. ?

Advertisement

Next Story