రేపు ఏపీ ప్రజలు శుభవార్త వినే అవకాశం ఉంది : వైపీపీ ఎమ్మెల్యే

by srinivas |
YCP MLA Kakani Govardhan reddy
X

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య మందుపై వైపీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య మందుపై ప్రభుత్వం విచారణ జరుపుతుండగా, పంపిణీకి బ్రేక్ పడింది. అయితే.. దీనిపై స్పందించిన సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి రేపు ఆనందయ్య మందుకు ప్రభుత్వ అనుమతులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. రేపు ఆయుష్ కమిషనర్ రాములు ప్రభుత్వానికి తుది నివేదిక ఇస్తారని చెప్పారు. సీఎం జగన్ కూడా ఈ మందుపై దృష్టి పెట్టారని, ప్రభుత్వం నుండి ఖచ్చితంగా ప్రజలకు శుభవార్తే వస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనుమతులు లభించాక ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని స్పస్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed