చంద్రబాబు చెప్పినట్టే నిమ్మగడ్డ పనిచేస్తున్నారు: అంబటి

by srinivas |
చంద్రబాబు చెప్పినట్టే నిమ్మగడ్డ పనిచేస్తున్నారు: అంబటి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఎస్ఈసీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన చేయడం వివాదస్పద నిర్ణయమని, ఏపీ ప్రభుత్వంతో తగాదా పెట్టుకోవాలని నిమ్మగడ్డ చూస్తున్నారని అంబటి విమర్శించారు. కొవిడ్ వ్యాక్సిన్ సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని, వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లే యోచనలో ప్రభుత్వం ఉందని, ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వం వివరణ ఇచ్చిందన్నారు. చంద్రబాబు తొత్తులా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ.. దురుద్దేశపూరితంగానే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారని ధ్వజమెత్తారు.

ప్రభుత్వ యంత్రాంగమంతా వ్యాక్సినేషన్‌లో నిమగ్నమై ఉందని, ఇలాంటి సమయంలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పటినట్టే నిమ్మగడ్డ పనిచేస్తున్నారన్న అంబటి రాంబాబు.. ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు జేబు సంస్థగా మార్చడం దురదృష్టకరమన్నారు. అసలు చంద్రబాబు హయాంలో నిమ్మగడ్డ ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని, ఎన్నికల నిర్వహణలో ఉద్యోగులకు ఎవరికైనా కొవిడ్ వస్తే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. లోకేశ్‌ ఇప్పటికీ కరోనా భయంతో ఉన్నారన్నారు.

Advertisement

Next Story