చంద్రబాబు బాగోతం బయటపడింది : అంబటి

by srinivas |
చంద్రబాబు బాగోతం బయటపడింది : అంబటి
X

ఐటీ రైడ్స్‌లో చంద్రబాబు బాగోతం బయటపడిందని, దాదాపు రెండువేల కోట్లు చేతులు మారాయని రుజువైందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మట్లాడుతూ… దీంతో తక్షణమే చంద్రబాబు, లోకేశ్‌లను అరెస్ట్ చేసి విచారించాలని తెలిపారు. సన్నిహితులపై ఐటీ దాడులు జరుగుతున్నా.. చంద్రబాబు తేలుకుట్టిన దొంగలా వ్యవహరించారని తెలిపారు. చంద్రబాబు పీఎస్‌ను విచారిస్తే అనేక విషయాలు బయటపడతాయని, తండ్రీకొడుకులు హైదరాబాద్‌లో తలదాచుకున్నారని విమర్శించారు. చంద్రబాబు కుమారుడిని విచారిస్తే లక్షల కోట్లు బయటపడతాయని తెలిపారు. రూ.2వేల కోట్లు దొరికాయంటే అది కేవలం పీఎస్ ఒక్కడి పనే కాదన్నారు. ఇప్పుడు దీనిని ఎలా మేనేజ్ చేయాలా అని ఇరువురూ హైదరాబాద్‌లో కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. అయినా ఇప్పుడు ఎంతమంది వచ్చినా చంద్రబాబును కాపాడలేరని ఆయన తెలిపారు. నీతి నిజాయితీ గురించి మాట్లాడే పవన్‌కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సీపీఐ రామకృష్ణ కూడా ఇప్పుడు ఎక్కడ పోయారని అంబటి రాంబాబు ఎద్దేశా చేశారు.

Advertisement

Next Story