- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం చంద్రబాబే’

దిశ ఏపీ బ్యూరో: అమరావతి ఉద్యమం ఏపాటిదో అందరికీ తెలుసని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. అనుకూల మీడియాలో 200 రోజుల నుంచి రెప్పవాల్చని పోరు జరిగిందని రకరకాల కథనాలు ప్రసారం చేసుకున్నారని మండిపడ్డారు. అమరావతి ఉద్యమ ఉధృతి ఏంటన్నది ఆ ప్రాంతంలో ఉండి చూసే వాళ్లకు తెలుస్తుందిని అన్నారు. అమెరికాలోనో, అనకాపల్లిలోనో ఉండి చూస్తే దాని అసలు స్వరూపం కనిపించదని చెప్పారు. 29 గ్రామాల్లో మొదలైన ఉద్యమం ఇప్పుడు మూడు గ్రామాల్లో కొన్ని ఇళ్లకు.. ఫొటోలకు పరిమితమైందని ఆయన అన్నారు. ‘వాస్తవిక ధృక్పథంతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వికేంద్రీకరణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కొద్దిమందిలో బాధ ఉంటే ఉండొచ్చు గానీ.. ఎక్కువ బాధ పడింది చంద్రబాబేనని ఆయన చెప్పారు. రాజధాని పేరుతో జరుగుతున్న ఉద్యమానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం చంద్రబాబేనని ఆయన విమర్శించారు.