వైసీపీ నేత సురేష్ సస్పెన్షన్..

దిశ, వెబ్‌డెస్క్ :

ఏపీలోని కర్నూల్ జిల్లా ఆదోని వైసీపీ నేత సురేష్ ఆదివారం సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆదోనిలోని మండగిరి గ్రామ సచివాలయానికి వెళ్లిన సురేష్ అక్కడి సచివాలయ ఉద్యోగులతో దురుసుగా ప్రవర్తించారు. ఇదేంటని అడిగినందుకు సచివాలయ ఉద్యోగి నరేంద్ర చెంప చెల్లుమనిపించారు.

ఈ ఘటనపై తోటి ఉద్యోగులు సురేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సురేష్ స్థానిక సీనియర్ నాయకుడితో మాట్లాడి సయోధ్య కుదర్చాలని వేడుకున్నారు. అంతలోనే సురేష్ బాగోతం తెలియడంతో స్థానిక ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి సురేష్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

Advertisement