- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గెజిట్ నోటిఫికేషన్ శుభపరిణామం.. వైసీపీ నేత సజ్జల
దిశ, ఏపీ బ్యూరో: గోదావరి, కృష్ణా ప్రాజెక్టు విషయంలో జల వివాదాల పరిష్కారం కోసం కేంద్రం రంగంలోకి దిగింది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గురువారం అర్ధరాత్రి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. నదీ జలాల విషయంలో న్యాయం ఏపీ వైపు ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన సమయంలోనే బోర్డుల పరిధిని నిర్ణయిస్తే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయ్యేది కాదన్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం నీళ్లను వృథా చేశారని ఆరోపించారు. ఏపీ ప్రయోజనాలకు తెలంగాణ ప్రభుత్వం గండికొట్టిందని సజ్జల ఆరోపించారు.