నిమ్మగడ్డపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

by srinivas |
నిమ్మగడ్డపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి రాజ్యాంగేతర శక్తిగా ప్రవర్తిస్తున్నారో చెప్పడానికి ఉదాహరణ నిమ్మగడ్డ రమేష్ అని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు. కొంతమంది ప్రలోభాలకు లోనై నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును నమ్మిన ఏ ఒక్కరూ బాగుపడినట్లు చరిత్రలో లేదని తెలిపారు.

గ్రామాల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని సీఎం జగన్ ఆలోచన అని లక్ష్మీపార్వతి అన్నారు. గాంధీ తర్వాత గ్రామ స్వరాజ్యానికి కోరుకుంది సీఎం జగన్ అని తెలిపారు. చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని జూమ్ యాప్ ద్వారా కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఇన్ని పాపాలకు కేంద్ర బిందువైన చంద్రబాబు మాటలు ఒక ఐఏఎస్ చదివిన వ్యక్తి ఎలా నమ్మారని అడిగారు.

Advertisement

Next Story