రైతులను అప్పులపాలు చేస్తున్న ప్రభుత్వం..!

దిశ వెబ్‎డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం రైతులను అప్పులపాలు చేస్తోందని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్‎ను ఎత్తేయడం రివర్స్ పాలన కారణమని విమర్శించారు. విద్యుత్ సంస్థల్ని సమర్ధవంతంగా నడపలేక రైతులపై భారం వేస్తున్నారని మండిపడ్డారు. కాగా, విద్యుత్ కనెక్షన్ ఒకరి పేరుపై, పొలం మరొకరి పేరుపై ఉంటే నగదు బదిలీ అనేది ఎలా సాధ్యమని నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు.

Advertisement