చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా వైకే సిన్హా

by Shamantha N |
చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా వైకే సిన్హా
X

న్యూఢిల్లీ: చీఫ్ ఇన్‌ఫర్మేషన్ కమిషనర్(సీఐసీ)గా యశ్వర్ధన్‌ కుమార్ ‌సిన్హా నియామకమయ్యారు. శనివారం రాష్ట్రపతి భవన్‌లో ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్ సీఐసీగా వైకే సిన్హాతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆగస్టు 26న బిమల్ జుల్కా పదవీకాలం ముగిసిన తర్వాత దాదాపు రెండునెలలపాటు సీఐసీ సీటు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. యూకే, శ్రీలంకలకు భారత హైకమిషనర్‌గా సేవలందించిన సిన్హా గతేడాది జనవరి 1న సమాచార కమిషనర్‌గా నియామకమయ్యారు.

తాజా నియామకంతో సిన్హా మూడేళ్ల కాలం సీఐసీగా కొనసాగుతారు. కాగా, ఉదయ్ మహుర్కర్, కార్మిక శాఖ మాజీ కార్యదర్శి హీరాలాల్ సమరియా, మాజీ డిప్యూటీ కాగ్ సరోజ్ పున్హాని‌లూ సమాచార కమిషనర్లుగా నియామకమయ్యారు. ఈ ముగ్గురితో సిన్హా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ముగ్గురి చేరికతో సమాచార కమిషనర్ల సంఖ్య ఏడుకు చేరింది. మొత్తం పది మంది కమిషనర్లకు అనుమతి ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed