- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కేజీఎఫ్-2 రిలీజ్ రోజున నేషనల్ హాలిడే..?
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్ : పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్-2 రిలీజ్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ కేజీఎఫ్-2కు ప్లాన్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవలే యశ్ పుట్టిన రోజు సందర్భంగా కేజీఎఫ్-2 టీజర్ కూడా విడుదలైంది. దానికి అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది.
అయితే, ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూలై-16వ తేదీన విడుదల చేయాలని మూవీ యూనిట్ ప్రకటించింది. కాగా, ఆ మూవీ రిలీజ్ నాడు దేశవ్యాప్తంగా సెలవు ప్రకటించాలని యశ్ అభిమానులు ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్రమోడీని కోరారు. అందుకు సంబంధించి ఓ లెటర్‌ను కూడా టాగ్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Next Story