- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'ఆర్ఆర్ఆర్‌కు అనర్హత వర్తించదు'
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు అనర్హత వర్తించదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. చట్టసభల బయట చేసిన వ్యాఖ్యలు, ప్రకటనలు అనర్హత చట్టంలోని సెక్షన్ 2 కిందకు రావని యనమల పేర్కొన్నారు. ‘ఒక ఎంపీ గానీ, ఎమ్మెల్యే గానీ ఎవరైనా చట్టసభల బయట మాట్లాడిన మాటలకు అనర్హత చట్టం వర్తించదు. ఈ చట్టం రెండు అంశాల్లో మాత్రమే వర్తిస్తుంది. ఒకటి…విప్ జారీచేస్తే దానికి అనుగుణంగా ఓటు వేయనప్పుడు.. రెండోది.. విప్‌కు కట్టుబడకుండా సభనుంచి గైర్హాజరైనప్పుడు అనర్హత చట్టం కింద చర్యలు తీసుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో ఈ రెండూ జరగలేదు. అందుకే ఆయనపై అనర్హత సెక్షన్ వర్తించదు’ అని పేర్కొన్నారు.
Advertisement
Next Story