సైకలాజికల్ థ్రిల్లర్‌లో యామీ..

by Anukaran |   ( Updated:2020-09-04 00:45:39.0  )
సైకలాజికల్ థ్రిల్లర్‌లో యామీ..
X

దిశ, వెబ్‌డెస్క్ :
ఫెయిర్ అండ్ లవ్‌లీ బ్యూటీ యామీ గౌతమ్ క్రేజీ చాన్స్‌లు కొట్టేస్తోంది. ఇప్పటికే పవన్ క్రిపాలని డైరెక్షన్‌లో వస్తున్న బూత్ పోలీస్ సినిమాలో అవకాశం చేజిక్కుంచుకున్న యామీ.. ఇప్పుడు మరో బ్యూటిఫుల్ ఆఫర్ దక్కించుకుంది. ఇప్పటివరకు పక్కింటి అమ్మాయిలాంటి పాత్రల్లోనే కనిపించిన ఈ బ్యూటీ.. ‘ఏ థర్స్‌డే’ సినిమా ద్వారా నటనా ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించబోతుంది. బెహ్జాద్ కంబట డైరెక్షన్‌లో వస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్‌ను రోనీ స్క్రూవాలా నిర్మిస్తుండగా.. ఇందులో ప్లే స్కూల్ టీచర్‌గా కనిపించనుంది యామీ.

కాగా, సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో నటించాలన్న తన కల ఈ సినిమాతో నెరవేరుతోందని ఆనందం వ్యక్తం చేసింది యామీ. అంతేకాదు సినిమా మొత్తం తన భుజస్కందాలపైనే మోయడం అనేది ఫస్ట్ టైమ్ అని, దీంతో చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని చెప్పింది. ఇక యామీని దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా కథ రాసినట్లు తెలిపారు డైరెక్టర్ అండ్ రైటర్ బెహ్జాద్. తను కూడా సినిమాకు ఓకే చెప్పడం ఆశ్చర్యం వేసిందన్నారు.

ఇక ‘ఏ థర్స్‌డే’ సినిమాలోని ప్లే టీచర్ క్యారెక్టర్ సమాజంలోని ఫెయిల్యూర్స్‌ను ఎత్తిచూపిస్తుందన్నారు నిర్మాత రోనీ స్క్రూవాలా. సమాజంలో ఒకరిగా ఉన్న మనం అసలు ఏం చేస్తున్నాం? అని మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుందన్నారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఆడియన్స్‌ను సూపర్ థ్రిల్‌కు గురిచేస్తుందని.. తర్వాత ఏం జరగబోతుందనే ఇంట్రెస్ట్ పెంచుతుందని చెప్పారు. కాగా ‘ఏ థర్స్‌డే’ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు ప్రకటించింది మూవీ యూనిట్.

Advertisement

Next Story