అనిరుధతో యామీకి వర్కౌట్ అయ్యేనా?

by Shamantha N |
అనిరుధతో యామీకి వర్కౌట్ అయ్యేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఫెయిర్ బ్యూటీ యామీ గౌతమ్‌కు 2021 బాగా కలిసొస్తోంది. ఇప్పటికే ‘బూత్ పోలీస్, ఏ ఫ్రైడే, దస్వి’ లాంటి బిగ్ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టిన యామీ.. కొత్తగా మరో ప్రాజెక్ట్‌కు సైన్ చేసింది. ‘పింక్’ డైరెక్టర్ అనిరుద్ధ రాయ్ చౌదరీ డైరెక్షన్‌లో వస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సోషల్ డ్రామాగా తెరకెక్కనున్న సినిమాకు మూవీ యూనిట్ ‘ఫరార్‌’ అనే టైటిల్‌‌ను ఫైనల్ చేసింది. మీడియా అండ్ క్రైమ్ జర్నలిజం చుట్టూ తిరిగే కథలో యామీ కీ రోల్ ప్లే చేయబోతుండగా.. మే నెలలో సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది.

ఇక అనిరుద్ధ రాయ్ చౌదరీ డైరెక్షన్‌లో వచ్చిన హార్డ్ హిట్టింగ్ ఫిల్మ్ ‘పింక్’ గురించి తెలిసిందే. ‘అది భర్త అయినా సరే భార్య సమ్మతి లేనిదే శృంగారం చేయరాదు’ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా.. సమాజంలో కొంత మార్పు తీసుకొచ్చిందనే చెప్పాలి. ఈ సినిమానే తాప్సీ కెరియర్‌ను మలుపు తిప్పగా.. ఇప్పుడు అదే డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ‘ఫరార్’ మూవీ యామీ కెరియర్‌‌కు బూస్టప్ ఇస్తుందా? చూడాలి మరి.

Advertisement

Next Story