దశాబ్దంలోనే అత్యల్పంగా టూ-వీలర్ అమ్మకాలు..!

by Harish |
దశాబ్దంలోనే అత్యల్పంగా టూ-వీలర్ అమ్మకాలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మరి కారణంగా వినియోగదారుల కొనుగోలు సెంటిమెంట్ బాగా క్షీణించింది. దీంతో 2020 భారత (India)మార్కెట్‎లో టూ-వీలర్ (Two wheeler) అమ్మకాలు దశాబ్దంలోనే అత్యల్పంగా ఉన్నాయని ప్రముఖ టూ-వీలర్ దిగ్గజ కంపెనీ యమహా (Yamaha)ఆదివారం వెల్లడించింది. ప్రస్తుత సంవత్సరం జనవరి-ఆగష్టులో దేశీయ అమ్మకాల్లో 36 శాతానికి పైగా అమ్మకాలు (sales) పడిపోయాయని సంస్థ పేర్కొంది.

ఈ ఏడాది అమ్మకాల పరిమాణం దశాబ్దంలోనే అత్యల్పంగా నమోదవ్వడం, రానున్న కొద్ది నెలలు కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉండడం సవాలుగా మారిందని యమహా మోటార్ ఇండియా సేల్స్ (Yamaha Domestic sales)సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ సింగ్ (Ravinder singh) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పండుగ సీజన్ మధ్య నాటికి మార్కెట్ సెంటిమెంట్ మెరుగవుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. వినియోగదారుల్లో వచ్చిన మార్పులను అనుసరించి వృద్ధిని సాధించేందుకు యమహా కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తుందని.. దానికి తగిన చర్యలను చేపడుతుందని తెలిపారు. మరోవైపు కరోనా వ్యాప్తిని అధిగమించి వినియోగదారులను చేరుకునేందుకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల (Digital platform) వాడకంపై కంపెనీ దృష్టి సారించిందని రవీందర్ సింగ్ వెల్లడించారు.

Advertisement

Next Story